Team India: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-08-31T15:42:42+05:30 IST
ఆసియా కప్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ న్యూలుక్‌లో అభిమానులకు కనిపించబోతున్నాడు. మహ్మద్ షమీకి తలపై జుట్టు తక్కువ ఉంటుంది. దాదాపు ఇటీవల అన్ని మ్యాచ్‌లలో అతడు బట్టతలతోనే కనిపించాడు. దీంతో అభిమానులు ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన అతడు ఇటీవల ముంబైలోని ఓ హెయిర్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలర్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు బౌలర్ల గురించే. ఒకరు జస్‌ప్రీత్ బుమ్రా అయితే మరొకరు మహ్మద్ షమీ. ఇప్పటికే గాయం కారణంగా చాన్నాళ్లు జట్టుకు దూరంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవల ఐర్లాండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో అతడు రాణించడం జట్టుకు ఎంతో ముఖ్యం. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ తన ప్రదర్శనతో అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆసియా కప్‌లోనూ రాణించేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే మహ్మద్ షమీకి తలపై జుట్టు తక్కువ ఉంటుంది. దాదాపు అతడు బట్టతలతోనే కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన అతడు ఇటీవల ముంబైలోని ఓ హెయిర్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఈ ప్రక్రియను సదరు క్లినిక్ యూట్యూబ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే బట్టతల బాధితులకు తిరిగి జుట్టు మొలిచేందుకు చేసే చికిత్స ప్రక్రియ. అయితే ఈ విధానంలో అనస్తీషియా ఇవ్వడం వల్ల కొందరు అసౌర్యానికి లోనవుతారు. కానీ షమీ మాత్రం ఎలాంటి అసౌకర్యానికి గురికాలేదని డాక్టర్లు వివరించారు. షమీ నుంచి సుమారు 4500 శిరోజాలను సేకరించి బట్టతల ప్రాంతంలో అతికించామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్
మరోవైపు తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మహ్మద్ షమీ కూడా స్పందించాడు. క్లినిక్ సిబ్బంది తనకు ఎంతో సహకరించారని.. నిజానికి ఈ ప్రక్రియ కోసం తాను చాలా భయపడినట్లు షమీ వివరించాడు. కానీ ఎలాంటి నొప్పి లేకుండా డాక్టర్లు తనకు చికిత్స చేశారని.. అయితే ఈ ప్రక్రియ ద్వారా తన తలపై తిరిగి జట్టు వస్తుందో లేదో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అనంతరం ముంబైలోని సదరు క్లినిక్ సిబ్బందితో షమీ సెల్ఫీలు కూడా దిగాడు.
కాగా సుమారు మూడు నెలల విరామం తర్వాత మహ్మద్ షమీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత అతడు మళ్లీ మైదానంలోకి దిగలేదు. వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్‌లకు సెలక్టర్లు షమీకి విశ్రాంతి ఇచ్చారు. దీంతో అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి. ఆసియా కప్‌లో షమీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.