TPCC Chief: రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం
ABN , First Publish Date - 2023-03-04T11:55:41+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెనుప్రమాదం తప్పింది.
రాజన్న సిరిసిల్ల: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కాన్వాయ్‌కు పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాదయాత్రలో భాగంగా రేవంత్ (TPCC Chief) శ్రీపాద ప్రాజెక్టు (Sripada Project) సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ (Revanth Reddy convoy)లో కార్లు ప్రమాదవశాత్తు వరుసగా ఢీకొట్టుకున్నాయి. అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. పలు మీడియా కార్లకూ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా... ఎవరి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం రేవంత్ వేరే కారులో శ్రీపాద ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లారు.
శ్రీపాద ప్రాజెక్ట్ పనులపై రేవంత్ ఆగ్రహం..
కాగా.. శ్రీపాద 9వ ప్యాకేజి కాలువను సందర్శించిన రేవంత్ రెడ్డి... అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలపై అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించారు. పనుల జాప్యంగా అధికారులను ప్రశ్నించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... శ్రీపాద కాలువ పనులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. కడప జిల్లా (Kadap District) కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాన్నారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులపై ఆ కాంట్రాక్టర్లకు ప్రేమలేదన్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో కేటీఆర్ (Telangana Minister) రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తక్షణమే 9వ ప్యాకేజి పనులు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.