Share News

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

ABN , Publish Date - Jul 20 , 2024 | 09:22 AM

Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవడంతో శనివారం తెల్లవారుజామున నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ష్యూరిటీలు సమర్పించేందుకు...

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్
Former MLA Ketireddy Peddareddy

అనంతపురం, జూలై 20: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Former MLA Ketireddy Peddareddy) తాడిపత్రికి (Tadipatri) చేరుకోవడంతో శనివారం తెల్లవారుజామున నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ష్యూరిటీలు సమర్పించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే వెళ్లాల్సి ఉంది. దీంతో ఈరోజు తెల్లవారుజామున పెద్దారెడ్డి నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లారు.

Telangana: బోనాలకు హాజరయ్యే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు..



పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత రెండు నెలలు నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేతిరెడ్డి తాడిపత్రి చేరుకుని పోలీస్‌స్టేషన్‌లో షూరిటీలు సమర్పించడంతో కొద్దిపాటి టెన్షన్ నెలకొంది.

ఏపీలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం


అయితే షూరిటీలు సమర్పించిన తర్వాత ఆయన సంతకం చేసి వెళ్లిపోయారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆయన పీఎస్‌లో షూరిటీలు సమర్పించిన వెంటనే ఎక్కువసేపు తాడిపత్రిలో ఉంచకుండా అనంతపురంకు తరలించారు. దీంతో ఎలాంటి అలజడి జరగకుండా వచ్చిన దారినే పెద్దారెడ్డి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

Gold and Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 09:29 AM