Share News

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:41 AM

Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (మంగళవారం) ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు
Tirumala

తిరుమల, జూలై 15: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో (Srivari Temple)రేపు (మంగళవారం) ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు. అలాగే ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సర్వం స్వాహా!


అలాగే సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈరోజు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది.

Anant Ambani-Radhika Merchant Wedding Reception: పూర్తైన అనంత్-రాధిక పెళ్లి వేడుకలు.. లాస్ట్ రోజు ప్రముఖుల హాజరు


శ్రీవారి దర్శనానికి 18 గంటలు...

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సంఖ్య పెరిగింది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. అలాగే నిన్న (ఆదివారం) శ్రీవారిని 84,797 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 29,497 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం లభించింది.


ఇవి కూడా చదవండి..

Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

Alwal: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 09:45 AM