Srinivasa Varma: ఏ ఒక్కర్నీ మరిచిపోను.. గుర్తుపెట్టుకుంటా.. కేంద్రమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 20 , 2024 | 08:29 PM
రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.
భీమవరం: రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు. పార్టీ కార్యకర్తలను విస్మరిస్తే భవిష్యత్తులో మంచిది కాదంటూ అప్పుడే అభిప్రాయం వ్యక్తం చేశామని తెలిపారు. ఈరోజు(గురువారం) తన నివాసానికి వచ్చారు.
ఈ సందర్భంగా భీమవరంలోని శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ... నామినేషన్ చివరి రోజు వరకు కూడా తన అభ్యర్థిత్వంపై చాలా ప్రచారాలు జరిగాయన్నారు. సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తే ఎలా గెలుస్తామనేది తాము గెలవడానికి నిదర్శనమన్నారు. తన గౌరవం ప్రతి బీజేపీ కార్యకర్తదని తెలిపారు. అందరితో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. 30 ఏళ్లలో ఎంతో మంది అధ్యక్షుల దగ్గర పని చేశానని వివరించారు. తనను ఈ స్థాయికి తెచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని చెప్పారు.
అసెంబ్లీలో వైసీపీని ఆడుకుంటాం: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
అసెంబ్లీలో వైసీపీని ఆడుకుంటామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఒక సిద్ధమా అయింది మరో సిద్ధం ఉందని ఎద్దేవా చేశారు.