YS Sharmila: మోదీ ఢిల్లీ అన్నారు.. జగన్ వాషింగ్టన్ అన్నారు... చివరకు మిగిలింది మట్టే..
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 PM
Andhrapradesh: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు.
విజయవాడ, ఏప్రిల్ 25: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు. చంద్రబాబు సిరంగపూర్ అన్నారని..త్రీడీ గ్రాఫిక్స్ చూపించి 30 వేల ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. 2015 లో మోడీ వచ్చి భూమి పూజ చేసి.. యమునా నది నుంచి మట్టి తెచ్చి ఇచ్చారని.. ఇక మనకు చివరకు మిగిలింది మట్టే అంటూ కామెంట్స్ చేశారు.
Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ఢిల్లీని తలదన్నే రాజధాని ఉండాలని మోడీ చెప్పారని.. బాబు సింగపూర్ లాంటి రాజధాని అన్నారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నారని.. అమరావతి కాస్తా చివరికి బ్రమరావతి చేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ తానే కట్టానని చంద్రబాబు అన్నారని.. హైదరాబాద్ మించిన రాజధాని అని మళ్ళీ చెప్పారన్నారు. బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్పా మిగిలింది ఏమి లేదన్నారు. దేశ విదేశాలు తిరిగారు తప్పా... పెట్టుబడులు రాలే అని అన్నారు. ఉద్యోగాలు లేవని.. పరిశ్రమలు లేవన్నారు.
AP Politics: ‘నీకిది తగునా’.. జగన్‌కు వివేకా సతీమణి సంచలన లేఖ..
ఇక జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే వాషింగ్టన్ డీసీ అన్నారనరి... తర్వాత ఒక్కటి కాదు మూడు రాజధానులు అన్నారని ఎద్దేవా చేశారు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి దిక్కులేదన్నారు. 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విరుచుకుపడ్డారు. రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే... మళ్ళీ వాళ్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఎందుకు నిధులు ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళు లేరన్నారు. మోదీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదని.. ఈ సారి బాబుకు ఓటు వేసినా, జగన్‌కు వేసినా డ్రైనేజీలో వేసినట్లే అని తెలిపారు. ‘‘మనకు రాజధాని కావాలి అంటే... కాంగ్రెస్ రావాలి. పోలవరం కట్టాలి అంటే రాజధాని రావాలి. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి’’ అని షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ..
Read Latest AP News And Telugu News