AP Elections: ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?..వైసీపీ నేతలను ప్రశ్నించిన సుజనా
ABN , Publish Date - May 04 , 2024 | 12:14 PM
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్‌తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు.
విజయవాడ, మే 4: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (BJP Candidate Sujana chowdary) విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్‌తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు. అనంతరం 35వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో (Election Campaign) సుజనా చౌదరి, నాగుల్ మీరా పాల్గొన్నారు. తాగు నీరు, డ్రైనేజీ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుజనాకు స్థానిక ప్రజలు వివరించారు.
Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!
తాను గెలిచిన వెంటనే యుద్ద ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించి.. దుర్వాసన లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ వారు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం మొత్తం తిరిగానని... ప్రజలు ఎక్కడా కూడా వారు బాగా చేశారని చెప్పిన వాళ్లే కనిపించలేదన్నారు. మీడియా ముందుకు వచ్చి గొప్పగా చేశామని చెప్పడమే కానీ.. వారు చేసింది ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. ఉన్న చెట్లను కూడా నరికి.. చిరు వ్యాపారాలకు నిలువ నీడ కూడా లేకుండా చేశారన్నారు.
Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
ముఠా కార్మికులు సేద తీరే ప్రాంతాల్లో చెట్లు తొలగించి నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న ప్రజలే వాళ్లు ఏమీ చేయలేదని చెబుతున్నారన్నారు. వాళ్లు రాక ముందు సమస్యలు ఏమిటని.. ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడ పని చేసిన ఎమ్మెల్యే, ఎంపీలను చూసి జాలి కలుగుతుందన్నారు. ఇటువంటి వారి మాటలు నమ్మి ప్రజలు వారిని ఎన్నుకున్నారన్నారు. ఐదేళ్లుగా అభివృద్ది లేక, సమస్యలు పట్టించుకునే వారు రాక ప్రజలు మోసపోయారన్నారు.
ఏసీ గదుల్లో కూర్చుని ప్రటనలు ఇవ్వడం కాదని.. మురుగు కంపులోకి వచ్చి మాట్లాడితే.. వైసీపీ వాళ్లు ఏం చేయలేదో తెలుస్తుందన్నారు. ‘‘అందుకే నేను ఈ ఐదేళ్లల్లో ఏం చేస్తానో, ఎలా చేస్తానో ప్రజలకు చెబుతున్నా. డివిజన్ వారీగా అభివృద్ధికి, యువత సంక్షేమానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశాను. అందుకే ఇంత ధైర్యంగా నేను ప్రజలకు హామీ ఇస్తున్నా.. భరోసా కల్పిస్తున్నా’’ అని స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబుల సారధ్యంలో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా అని సుజనా చౌదరి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Pension: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు
Loksabha Polls: ఆప్‌కు ఊరట..? ఎందుకంటే...?
Read Latest AP News And Telugu News