Share News

AP Elections: ఎన్నికల వేళ ప్రభుత్వ అధికారులు కోర్టుకు వెళ్ళడం ఏంటి?: కనకమేడల

ABN , Publish Date - May 10 , 2024 | 12:27 PM

Andhrapradesh: ఈసీ నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ ఆరు స్కీమ్స్‌కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు.

AP Elections: ఎన్నికల వేళ ప్రభుత్వ అధికారులు కోర్టుకు వెళ్ళడం ఏంటి?: కనకమేడల
Former MP kanakamedala Ravindra kumar

న్యూఢిల్లీ, మే 10: ఈసీ (Election Commission) నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ (Jagan Government) వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Former MP kanakamedala Ravindra kumar) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ (CM Jagan) ఆరు స్కీమ్స్‌కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు. జగన్ వారి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేశారని ఆరోపించారు. కోర్టును పక్కదారి పట్టించే విధంగా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు.

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!


ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వం ఓట్లు కొనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు అందరూ ఎన్నికల నియమావళి కింద పని చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారులు కోర్టుకు వెళ్ళడం ఏంటి అని ప్రశ్నించారు. ఈసీ పెన్షన్ దారులకు ఇంటికి వెళ్లి నిధులు ఇవ్వమంటే ఇవ్వరా అంటూ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Supreme Court: తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం


జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే...

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అధికారంలోకి వస్తేనే నిధులు, ఉద్యోగాలు, అభివృద్ధి ఉంటుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పథంలోకి వస్తుందని తెలిపారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని.. 13 లక్షల కోట్ల పైన అప్పులు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఇంకా ఏమి లేదని చెప్పుకొచ్చారు.

Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది


జలు వైసీపీని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక్క ఏపీలో మాత్రమే అమలులో ఉందన్నారు. చీఫ్ సెక్రటరీ వైసీపీ పార్టీకి అడుగులకు మడుగులను అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అందరికీ వర్తిస్తుందన్నారు. ప్రజల అస్తులకు రక్షణ లేకుండా పోతుందని వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక కత్తిలాంటిందని..దీని ద్వారా ప్రజల ఆస్తులు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని.. తాకట్టు పెట్టకుండా ఉన్నది ప్రజల ఆస్తులు మాత్రమే అని కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్‌డేట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 01:35 PM