Share News

Palla Srinivasa Rao: ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం.. వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విసుర్లు

ABN , Publish Date - Aug 08 , 2024 | 06:49 PM

వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు.

Palla Srinivasa Rao: ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం.. వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విసుర్లు
Palla Srinivasa Rao

అమరావతి: వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం 3 గంటల పాటు జరిగిందని అన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణం, నామినేటెడ్ పోస్టులు, నదుల అనుసంధానంపై చర్చించామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.


నీరు, చెట్టు బిల్లులపై చంద్రబాబు ఆరా తీశారని చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన టీడీపీ నాయకులు, ప్రజలకు పొలిట్ బ్యూరో తరఫున ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ విధ్వంసక పాలన, ఫేక్ ప్రచారంపై సమర్థవంతంగా తిప్పి కొట్టాలని నిర్ణయం తీసుకున్నామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: కాలువ శ్రీనివాసులు

kalva-Srinivasulu.jpg

జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నాయకులను, పార్టీని అనుసంధానం చేస్తామని వివరించారు. తొలి ఐదు సంతకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు పార్డీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు అని ఉద్ఘాటించారు. నదులను అను సంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులో ఎత్తి పోస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించేందుకే చంద్రబాబు పీ4 ఫార్ములా తెస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.‌‌ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Updated Date - Aug 08 , 2024 | 06:58 PM