Ramprasad Reddy: ఆ ఘనత చంద్రబాబుదే.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 09 , 2024 | 05:57 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపక్షపాతితో పనిచేస్తుందని అన్నారు.
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపక్షపాతితో పనిచేస్తుందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రజల్లో మంచి ప్రభుత్వం అనిపించు కునేలా వ్యవహరిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం లాగా దాడులు చేసే సంస్కృతీ తమకు లేదని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈరోజు(మంగళవారం) కడపలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాల్లో యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లను నియమించడం జరిగిందని చెప్పారు.
ఒకటో తేదీనే రూ.65 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఉద్ఘాటించారు. వైసీపీ నిరుద్యోగుల పొట్ట కొట్టిందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా డీఎస్సీ విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. స్మగ్లర్లను యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను ప్రోత్సాహంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లను త్వరగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలకు మేలు జరిగే ఏ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పోలవరం పనులను పరిశీలించారని గుర్తుచేశారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పని చేస్తామని.. రైతు భరోసా కేంద్రాలు చివరి క్షణాల్లో నిర్మించారని అన్నారు. లోటు బడ్జెట్‌లో ప్రభుత్వం ఏర్పడినా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేశామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.