Share News

ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:43 PM

Andhrapradesh: విశాఖ శారదా పీఠంకు ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో శారద పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే...

ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం
AP Government

అమరావతి, అక్టోబర్ 19: విశాఖ శారదా పీఠంకు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలం విషయంలో కూటమి ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠంకు ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో శారద పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి (TTD) ఆదేశాలు ఇచ్చింది.

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..


విశాఖలో (Visakhapatnam) 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే కేవలం రూ.15 లక్షలకు స్వాములోరీ పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. విశాఖ నుంచి వచ్చిన నివేదికను కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు తొక్కి పెట్టినట్లు సమాచారం. దీనిపై ఆంధ్రజ్యోతి (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం ప్రసారం అయ్యింది. ఈ కథనంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు.

KTR: కేటీఆర్ ట్వీట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్..


వెంటనే ఫైల్ తెప్పించుకొని అధికారులపై సీరియస్ అయ్యారు. ఆపై నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఉన్న భూమిని కట్టబెట్టడాన్ని రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్వర్వులను జారీ చేయనుంది. అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శార సోమవారం పీఠం నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి..

Rains: ఇంకా.. జలదిగ్బంధంలోనే శివారు ప్రాంతాలు..

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 01:44 PM