Share News

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:15 AM

Andhrapradesh: సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్‌లో ప్రధానంగా చర్చజరుగనుంది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..
AP Cabinet Meeting

అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నారు. అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్‌లో ప్రధానంగా చర్చజరుగనుంది.

Pager Explosives: ఒక్కో పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థాలు.. ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ పక్కా ప్రణాళిక!


18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా చర్చ జరుగనుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించాడంలో భాగంగా పీ 4 పైనా ఈరోజు కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.


అలాగే పెండింగులో ఉన్న నీరు - చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదలపై చర్చ జరుగనుంది. బుడమేరు ముంపు, వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైనా కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Pager Explosives: ఒక్కో పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థాలు.. ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ పక్కా ప్రణాళిక!

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 11:22 AM