Share News

Yanamala: జగన్‌పై యనమల సంచలన వ్యాఖ్యలు... ఏ విషయంపై అంటే?

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:30 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల.. జగన్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

Yanamala: జగన్‌పై యనమల సంచలన వ్యాఖ్యలు... ఏ విషయంపై అంటే?
Yanamala Ramakrishnudu

అమరావతి, జూలై 26: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YSRCP Chief YS Jaganmohan Reddy) గురించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు (TDP Senior MLC Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల.. జగన్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని.. ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకు కూడా ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతమని చెప్పుకొచ్చారు.

AP News: సీబీసీఐడీకి డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు


ఇండియా కూటమిలో చేరడం జగన్‌‌కు అనివార్యమన్నారు. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉన్నామన్నారు. దీంతో ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి తలెత్తిందన్నారు. అలాగే వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) కూడా... కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూటమి పార్టీగా ఇండియాలో జగన్ భాగస్వామిగా ఉండబోతున్నారంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్‌కు ఉందా..? అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదు’’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.


ఢిల్లీలో ధర్నా...

కాగా.. ఈనెల 24న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వైఎస్ జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ మాజీ సీఎం ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని పరిస్థితులపై జంతర్ మంతర్ వద్ద ఫోటో, వీడియో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. జగన్‌తో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. వైసీపీ ఆందోళనకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అలాగే శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ సంజయ్ రౌత్ కూడా వైసీపీ ధర్నాకు మద్దతు పలికారు. ధర్నాలో భాగంగా ఏపీ సర్కార్‌పై జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వరకు హత్యలు జరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హేయమైన పనులపై జర్నలిస్టులు ఇకనైనా గళం విప్పాలని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. త్యాగాలను స్మరించుకున్న ప్రధాని



నిరాశతో వెనుదిరిగిన జగన్....

అయితే ధర్నా జరిగినప్పటి నుంచి జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర‌పతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌లను జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్‌కు ఘోర అవమానమే ఎదురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం యత్నించి నిరాశ చెందారు. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు అంతా నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక.. ఎవరినీ కలవకుండా జగన్ విజయవాడ బాట పట్టారు. రెండు రోజులు వేచి చూసినా కూడా ఏ ఒక్కరి అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో జగన్ నిరాశతో వెనుదిరిగారు.


ఇవి కూడా చదవండి..

MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..

Japan: జపాన్‌లో భారీగా తగ్గుతున్న జనాభా.. ఎందుకో తెలుసా

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 12:37 PM