Share News

AP Politics: జగన్ రాక ఆలస్యం.. మహిళల అసహనం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:51 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పర్యటన పలువురు మహిళల్లో అసహనాన్ని రేకెత్తించింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు2023 త్రైమాసికానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఈరోజు (శుక్రవారం) పామర్రులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే సీఎం పామర్రుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సభాస్థలికి వచ్చారు.

AP Politics: జగన్ రాక ఆలస్యం.. మహిళల అసహనం

కృష్ణా జిల్లా, మార్చి 1: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan Reddy) కృష్ణా జిల్లా పర్యటన పలువురు మహిళల్లో అసహనాన్ని రేకెత్తించింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు2023 త్రైమాసికానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఈరోజు (శుక్రవారం) పామర్రులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే సీఎం పామర్రుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సభాస్థలికి వచ్చారు. అయితే జగన్ (AP CM Jagan) ) రావడానికి ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సభా వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న మహిళలు (Womens) ఎండ వేడి తట్టుకోలేక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా సీఎం కాన్వాయ్‌కు దగ్గరగా మహిళలను నిల్చోబెట్టేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించారు. పోలీసులు (Police) అడ్డుకోవడంతో వారితో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు.

అటు సభా ప్రాంగణంలో సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో రోడ్ల వెంబడి ఫ్లెక్సీల నీడలో, చెట్ల కింద మహిళలు, వృద్ధులు కూర్చున్న పరిస్థితి నెలకొంది. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సీఎం రాకముందే సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు ప్రయత్నిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ నాయకులు (YCP Leaders) అప్పటికప్పుడు వేదిక సమీపంలో టెంట్లు వేసి మహిళలను కూర్చోబెట్టారు.

YS Sunitha: వివేకా హత్య జరిగి ఐదేళ్లు.. సునీత సంచలన ప్రెస్‌మీట్

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 01 , 2024 | 12:06 PM