Share News

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

ABN , Publish Date - Mar 31 , 2024 | 03:42 PM

Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

అమరావతి, మార్చి 31 : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి (Kalavathi) కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కాగా.. కళావతమ్మ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం లేదా.. రేపు ఉదయం అచ్చెన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

వైఎస్ జగన్‌పై చెప్పు విసరడం భావప్రకటన స్వేఛ్చ కాదా.. ఇప్పుడు తెలిసొచ్చిందా..!?


అంతా పాలిటిక్స్!

కాగా.. కళావతికి మొత్తం ఏడుగురు సంతానం. ఇందులో నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నలుగురి కుమారుల్లో ఒకరు అచ్చెన్నాయుడు. టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కళావతి కుమారుడే. ఈయన అందరికంటే పెద్దవాడు. కింజరపు కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయాల్లో ఉన్నవారే. ప్రస్తుతం అచ్చెన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ కూడా చేస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే టీడీపీలోకి ఎర్రన్నాయుడు రాగా.. అప్పట్నుంచి ఇప్పటి వరకూ తెలుగుదేశంలోనే ఈ కుటుంబం కొనసాగుతోంది. కళావతి కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు దాదాపు రాజకీయాల్లోనే.. అది కూడా టీడీపీలోనే ఉంటున్నారని చెప్పుకోవచ్చు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 03:53 PM