Share News

Budget 2024: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల కోసం కొత్త పథకం..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 02:10 PM

Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్‌పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.

Budget 2024: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల కోసం కొత్త పథకం..!
Budget 2024

Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్‌పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. మైనర్ పిల్లలు పెద్దవారైన తరువాత అంటే 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ సాధారణ NPSకి మారుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెన్షన్‌ ప్లాన్‌ను ముందుగానే తీసుకోవచ్చు. NPS వాత్సల్య పథకం.. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహకరిస్తుంది.


NPS వాత్సల్య అంటే ఏమిటి?

NPS వాత్సల్య అనేది మైనర్‌ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. ఈ పథకంలో తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్‌ సురక్షితంగా ఉండేందుకు ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకం సాధారణ NPSకి మారుతుంది. ఈ పథకం కాల వ్యవధి ముగిసిన తరువాత వారికి ప్రతి నెల పెన్షన్ అందుతుంది.


NPS అంటే ఏంటి?

ప్రజలు తమ పదవీ విరమణ తరువాత.. ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి పెన్షన్ రూపంలో ఆదాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వం NPS పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ అనంతరం నెలవారీ పెన్షన్‌ను అందుకోవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చట్టం - 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది.


NPS కి ఎవరు అర్హులు..?

ఎన్‌పీఎస్ పథకంలో చేరాలంటే.. భారతదేశ పౌరులై ఉండాలి. నాన్ రెసిడెంట్ అయినా.. ఓవర్సీస్ సిటిజన్ అయినా.. ఇండియన్ మెంబర్షిఫ్ ఉంటే.. ఎన్‌పీఎస్ అకౌంట తెరువొచ్చు. ఇక 18 నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. e-NPS ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read:

మహిళలకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3 లక్షల కోట్లు..!

వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన

వారు మన మధ్య లేకపోవడం బాధాకరం

For More National News and Telugu News..

Updated Date - Jul 23 , 2024 | 02:10 PM