Share News

Anganwadi: అన్నంలో పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:11 PM

పిల్లలకు పంచిన భోజనం ప్యాకెట్లలో చనిపోయిన పాము పిల్ల బయటపడింది. అది చూసి చిన్నారి తల్లిదండ్రులు హడలిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పశ్చిమ సాంగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాంగ్లీ జిల్లాలోని పాలూస్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.

Anganwadi: అన్నంలో పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Snake in Mid Day Meal

ముంబై, జులై 05: పిల్లలకు పంచిన భోజనం ప్యాకెట్లలో చనిపోయిన పాము పిల్ల బయటపడింది. అది చూసి చిన్నారి తల్లిదండ్రులు హడలిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పశ్చిమ సాంగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాంగ్లీ జిల్లాలోని పాలూస్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే, ఆ ఓ చిన్నారికి ఇచ్చిన ప్యాకెట్లతో చనిపోయిన పాము కనిపించింది. దీంతో భయపడిపోయిన చిన్నారి తల్లిదండ్రులు.. దానిని ఫోటో తీసి అంగన్‌వాడీ వర్కర్స్ పంపిచారు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read: చిత్తూరులో వైసీపీకి ఊహించని షాక్


కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం..

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా మహారాష్ట్రలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందించే మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. ఇది తీవ్రమైన సమస్య. గర్భిణులు, చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

Also Read: బైరెడ్డికి హ్యాండిచ్చేశారుగా!


అధికారుల స్పందన..

ఈ అంశంపై స్పందించిన అధికారులు.. ‘రాష్ట్రంలో ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అంగన్‌వాడీలో మధ్యాహ్న భోజనం, దాల్ ఖిచిడీ ప్రీమిక్స్ ప్యాకెట్లను అందజేస్తారు. పాలూరులో కూడా అంగన్‌వాడీ కేంద్రానికి ప్రీమిక్స్ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆ ప్యాకెట్లను అంగన్‌వాడీ వర్కర్స్ పిల్లలకు పంపిణీ చేశారు. అయితే, తమకు అందిన భోజనం ప్యాకెట్‌లో చిన్న చనిపోయిన పాము కనిపించిందని ఓ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. దాని ఫోటోని అంగన్‌వాడీ వర్కర్‌కు పంపించారు. అనంతరం పామును పడేశారు.’ అని తెలిపారు.

Also Read: సంజయ్ సింగ్‌కు 'ఆప్' కీలక బాధ్యత


గోడౌన్ సీజ్..

భోజనం ప్యాకెట్‌లో పాము అంశంపై సాంగ్లీ జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌కు సమాచారం అందించగా.. సీరియస్ అయ్యారు. భోజనం ప్యాకెట్లు నిల్వ ఉంచిన గోడ్‌ను సీల్ చేయించారు. అంతేకాదు.. ప్రీమిక్స్‌డ్ మీల్ ప్యాకెట్లను సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు కాంట్రక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ప్రీ మిక్స్‌డ్ మీల్స్ ప్యాకెట్లను టెస్ట్‌ల కోసం ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ లేబోరేటరీకి పంపించారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఏమైనా తేడాగా వస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 05 , 2024 | 04:11 PM