Share News

Maharashtra Assembly Elections: అమిత్‌షా ర్యాలీలు రద్దు

ABN , Publish Date - Nov 17 , 2024 | 02:33 PM

షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.

Maharashtra Assembly Elections: అమిత్‌షా ర్యాలీలు రద్దు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elctions) ప్రచారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారంనాడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) జరపాల్సిన పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. అయితే పాలనాపరమైన అనివార్యతల కారణంగా ర్యాలీలను రద్దు చేసుకుని ఢిల్లీకి అమిత్‌షా వెళ్లినట్టు బీజేపీ విదర్బ ఆర్గనైజేషనల్ సెక్రటరీ ధ్రువీకరించారు.

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం


అమిత్‌షాకు బదులుగా...

కాగా, అమిత్‌షాకు బదులుగా ఆయన పాల్గొనాల్సిన ర్యాలీల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు పాల్గోనున్నారు. దీనికి ముందు, అమిత్‌షా సోషల్ మీడియా 'ఎక్స్' ద్వారా బాలాసాహెబ్ థాకరే వర్దంతి సందర్భంగా నివాళులర్పించారు. సనాతన ధర్మం, జాతీయ ప్రయోజనాలకు బాలాసాహెబ్ తన జీవితాన్ని అంకింతం చేశారని, సిద్ధాంతాలకు కట్టుబడే విషయంలో ఎప్పుడు చర్చ వచ్చినా బాలాసాహెబ్ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. సనాతన సంస్కృతి, సాంప్రదాయాలకు అనేక సవాళ్లు ఎదురైన సమయంలోనూ సిద్ధాంతాలకు కట్టుబడి బాలాసాహెబ్ నిలిచారని ప్రశంసించారు.


కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎన్‌సీపీతో కలిసి మహాయుతి సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో చూపిన ఫలితాలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకు విజయం సాధించి పెడతాయని విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమిలోని కాంగ్రెస్-ఎన్‌సీపీ(ఎస్‌పీ)-శివసేన (యూబీటీ) గట్టి నమ్మకంతో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..

Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 17 , 2024 | 02:33 PM