Share News

Viral Video: వామ్మో.. ఈ పులి దొంగలనే మించిపోయిందిగా.. బోనులో పెడితే చివరకు..

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:29 PM

పులులు, సింహాలు వేట చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే అంతే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వేట కనబడగానే దాడి చేయాల్సి పులి.. కొన్నిసార్లు వాటిని రక్షించడం చూస్తుంటాం. అలాగే నీళ్లలో పడిపోయిన చెత్తాచెదారాన్ని బయటికి తీసి, దూరంగా పడేయడం చూస్తుంటాం. చివరకు..

Viral Video:  వామ్మో.. ఈ పులి దొంగలనే మించిపోయిందిగా.. బోనులో పెడితే చివరకు..

పులులు, సింహాలు వేట చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే అంతే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వేట కనబడగానే దాడి చేయాల్సి పులి.. కొన్నిసార్లు వాటిని రక్షించడం చూస్తుంటాం. అలాగే నీళ్లలో పడిపోయిన చెత్తాచెదారాన్ని బయటికి తీసి, దూరంగా పడేయడం చూస్తుంటాం. చివరకు తమను వీడియో తీస్తున్న వారిని సున్నితంగా హెచ్చరించి, వారి చేయిని బోను నుంచి బయటికి నెట్టిన సింహాలను కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పులి విచిత్రప్రవర్తన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోనులో బంధించిన పులి. చూస్తుండగానే ఎంతో తెలివిగా దాన్నుంచి బయటికి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. ఈ పులి దొంగలనే మించిపోయిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పులిని బోనులో బంధించి ఉంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. పులి దాన్నుంచి బయటికి రావడం చూసి అంతా షాక్ అవుతున్నారు. బోనులో ఉన్న పులి ఎలాగైనా బయటికి వెళ్లాలనే ఉద్దేశంతో అతి తెలివిగా ప్రవర్తించింది. బోనుకు తాళం వేసి ఉండడాన్ని గమనించి, ముందుగా దాన్ని లాగేసే ప్రయత్నం చేసింది. నోటితో తాళాన్ని పట్టుకుని లాగాలని చూసింది.

Viral Video: బిల్డింగ్‌పై పని చేస్తూ.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


అయితే మొదట పులి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ పట్టు వదలకుండా పదే పదే ప్రయత్నాలు చేసింది. ఇలా చివరికి తాళాన్ని విజయవంతంగా పక్కకు లాగేసి, ఇనుప గేటును తీసి బయటికి వచ్చేసింది. ఇలా పులి ఎంతో తెలివిగా (tiger come out of the cage) బోను నుంచి బయటికి వచ్చిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పులి దొంగలనే మించిపోయిందిగా’’.., ‘‘జంతువులు మనం ఊహించినదానికంటే చాలా తెలివైనవి’’.., ‘‘ఈ పులి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటోంది’’.., ‘‘వణ్యమృగాలను అడవుల్లో వదిలేయాలి’’.., ‘‘ఈ పులి చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 17 , 2024 | 09:29 PM