Share News

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

ABN , Publish Date - May 19 , 2024 | 04:46 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

  • టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాల్లో ర్యాంకుల తీరిది

  • టాప్‌-10లో 16మంది అబ్బాయిలే

  • అగ్రి-ఫార్మసీ, ఇంజనీరింగ్‌లో టాపర్లుగా

  • ఏపీకి చెందిన ప్రణీత, జ్యోతిరాదిత్య

  • వారంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: బుర్రా

  • 7 రోజుల్లో ఫలితాలు వెల్లడించిన

  • అధికారులకు ప్రశంసలు

హైదరాబాద్‌/సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత మొదటి ర్యాంకులు సాధించారు. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌కు చెందిన రిషి శేఖర్‌ శుక్లా ఇంజనీరింగ్‌లో 3వ ర్యాంకు, హనుమకొండ జిల్లాకు చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రి-ఫార్మసీలో 3వ ర్యాంకు సాధించారు. టీఎ్‌సఎ్‌పసెట్‌ ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. తొలి పది ర్యాంకులను పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో 9 మంది, అగ్రికల్చర్‌-ఫార్మసీలో ఏడుగురు


కావడం గమనార్హం. జేఎన్టీయూ క్యాంప్‌సలో శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. టీఎ్‌సఎ్‌పసెట్‌లో భాగంగా ఈ నెల 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ, 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఇంజనీరింగ్‌ పరీక్షకు 2,40,618 మంది, అగ్రికల్చర్‌-ఫార్మసీ పరీక్షకు 91,633 మంది హాజరయ్యారు. ఈ మేరకు ఇంజనీరింగ్‌లో 1,80,424 మంది (74.98శాతం) ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలో 82,163మంది (89.67శాతం) అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్‌లో 5.35శాతం, అగ్రికల్చర్‌-ఫార్మసీలో 3.35శాతం మేర ఉత్తీర్ణత తగ్గింది.


రికార్డు సమయంలో ఫలితాల విడుదల

ఎప్‌సెట్‌ పరీక్షల ఫలితాలను రికార్డు సమయంలో (7 రోజుల్లోనే) విడుదల చేశామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వర్షం కారణంగా ఒకటి, రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు మినహా.. ఎప్‌సెట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. పరీక్షల నిర్వహణతోపాటు అతి తక్కువ సమయంలో ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేసిన సెట్‌ కన్వీనర్‌ నర్సింహారెడ్డి, కన్వీనర్‌ డీన్‌ కుమార్‌, కో కన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి తదితరులను ప్రశంసించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 1.64లక్షలపైగా ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయని, అడ్మిషన్ల నిమిత్తం వారంలోగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ అభ్యర్థులకు సరిపడా సీట్లు ఉన్నాయని, ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ కోర్సులకే డిమాండ్‌ ఉంటోందని చెప్పారు. బీ-కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను కూడా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసే ఆలోచన ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు తీసుకున్న శ్రీనిధి ఇంజనీరింగ్‌ కాలేజీ విషయంలో మేనేజ్‌మెంట్‌ కోటాను రద్దు చేశామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇంజనీరింగ్‌ తొలి 10 ర్యాంకర్లు వీరే..

ర్యాంకు పేరు జిల్లా /రాష్ట్రం మార్కులు

1 సతివాడ జ్యోతిరాదిత్య శ్రీకాకుళం(ఏపీ) 155.63

2 గొల్లలేఖ హర్ష కర్నూలు(ఏపీ) 152.08

3 రిషిశేఖర్‌ శుక్లా సికింద్రాబాద్‌(టీజీ) 150.66

4 భోగలపల్లి సందేశ్‌ హైదరాబాద్‌(టీజీ) 149.59

5 మురసాని యశ్వంత్‌రెడ్డి కర్నూలు(ఏపీ) 145.64

6 పుట్టి కుశల్‌ కుమార్‌ అనంతపురం(ఏపీ) 142.82

7 హుందేకర్‌ విదీత్‌ రంగారెడ్డి(టీజీ) 142.58

8 పబ్బా రోహన్‌ సాయి హైదరాబాద్‌(టీజీ) 141.83

9 కొంతం మణితేజ వరంగల్‌(టీజీ) 141.46

10 ధనుకొండ శ్రీనిధి విజయనగరం(ఏపీ) 141.00


అగ్రికల్చర్‌, ఫార్మసీ తొలి 10 ర్యాంకర్లు వీరే

ర్యాంకు పేరు జిల్లా/రాష్ట్రం మార్కులు

1 ఆలూరు ప్రణీత అన్నమయ్య(ఏపీ) 146.44

2 నాగుదాసరి రాధాకృష్ణ విజయనగరం(ఏపీ) 145.42

3 గడ్డం శ్రీవర్షిణి హనుమకొండ(టీజీ) 145.25

4 సోంపల్లి సాకేత్‌ రాఘవ్‌ చిత్తూరు(ఏపీ) 145.10

5 రేపాల సాయివివేక్‌ హైదరాబాద్‌(టీజీ) 144.62

6 మహమ్మద్‌ అజాన్‌సాద్‌ హైదరాబాద్‌(టీజీ) 144.61

7 వడ్లపూడి ముకేశ్‌ చౌదరి తిరుపతి(ఏపీ) 143.51

8 జెన్ని భార్గవ్‌ సుమంత్‌ మేడ్చల్‌(టీజీ) 143.50

9 జయశెట్టి ఆదిత్య హైదరాబాద్‌(టీజీ) 142.99

10 పూల దివ్యతేజ సత్యసాయి (ఏపీ) 141.01

Updated Date - May 19 , 2024 | 04:46 AM