Share News

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 17 , 2024 | 01:46 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కుమార్తె క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌గా.. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైర‌తాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కుమార్తె క‌విత‌ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేయ‌గా.. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్(BRS) ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైర‌తాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. ఏఐసీసీ (AICC) తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ దీపాదాస్ మున్షీ స‌మ‌క్షంలో ఆ ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

Danam-And-Ranjith-Reddy.jpg

ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డేనా..?

రంజిత్‌రెడ్డి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొద‌ట బీజేపీలో ఆయ‌న చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగినా.. ఆ పార్టీ చెవేళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్ రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో సునీత రెడ్డికి మ‌ల్కాజ్‌గిరి టికెట్ ఇచ్చి, రంజిత్ రెడ్డిని చెవేళ్ల నుంచి పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ని‘దానం’గానే చేరిపోయారుగా..!

రంజిత్‌రెడ్డితో పాటు ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కాంగ్రెస్‌లో చేరారు. గ‌తంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ప‌ని చేశారు. 2018లో ఆయ‌న బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా ఆ పార్టీని వీడి హ‌స్తం గూటికి చేరుకున్నారు. అయితే నిన్న, మొన్నటి వరకూ అబ్బే బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదన్నట్లుగా చెప్పిన దానం.. నిదానంగా కారు దిగేసి.. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం పోటీచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 02:00 PM