Loksabha polls 2024: బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే.. రఘురాంరెడ్డి ఫైర్
ABN , Publish Date - May 06 , 2024 | 10:16 AM
Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ రైడ్స్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ (పాత వెంకటేశ్వర థియేటర్) వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా, మే 6: బీజేపీపై (BJP) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి (Congress MP candidate Rama Sahayam Raghuram Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ రైడ్స్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ (పాత వెంకటేశ్వర థియేటర్) వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఉండేవారు చాలా చైతన్య వంతులన్నారు. బీజేపీ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విరుచుకుపడ్డారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్‌పై నేడు తీర్పు
ఇక్కడ బీజేపీ అభ్యర్థి అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం అంటున్నారని.. 10 ఏళ్లు అధికారంలో ఉండి కొత్తగూడెం రైల్వే లైన్‌ను ఎందుకు వేయించలేదని ప్రశ్నించారు. రాముడిని కొలిచేది తామే అన్నట్లు రాముడిని రాజకీయాల్లోకి బీజేపీ లాగుతోందని మండిపడ్డారు. గతంలో గ్యాస్ ధర కేవలం రూ.500 ఉండేది, బీజేపీ వచ్చాక మాత్రం ఆ ధర అందలానికి ఎక్కిందన్నారు. బీఆర్ఎస్ (BRS) సుమారు 3 వేల రోజులు అధికారంలో ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 140 రోజులే అవుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో సుమారు అన్ని అయినట్లే అని చెప్పుకొచ్చారు.
Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..
10 ఏళ్లు పరిపాలన చేసి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ధరణి ద్వారా రాష్ట్రంలో ఉన్న చికాకులను కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడేలా చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు శక్తివంతులైన నాయకులు ఉన్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ ఖమ్మం జిల్లాకు ఇంత శక్తివంతమైన నాయకులు లేరన్నారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ‘‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లాను వదలకుండా ఉంటాను’’ అని రామ సహాయం రఘురాంరెడ్డి కోరారు.
Janasena: సాయిధరమ్ తేజ్‌పై వైసీపీ మూకల దాడి.. అసలేం జరిగింది..?
మా మామ నా మాటే వింటారు...
ఈ కార్యక్రమంలో రఘురాంరెడ్డి కోడలు దగ్గుబాటి ఆశ్రిత పాల్గొని ప్రసంగించారు. ‘‘మా మామ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ రోజంతా ఉండాల్సి వస్తుంది. ఆయన జిల్లాకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు . ఆయన వారి కొడుకు మాట కంటే ఎక్కువగా నా మాటే వింటారు. ఆయనకు మద్దతుగా మా నాన్న రేపు ఖమ్మంలో పర్యటిస్తారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను’’ అని ఆశ్రిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
TS Lok Sabha Polls: జహీరాబాద్‌లో బీసీల బాద్‌షా ఎవరో..?
H D Revanna: కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన హెచ్‌డీ రేవణ్ణకు మరో షాక్
Read Latest Telangana News And Telugu News