Delhi Liquor Scam: ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్.. కారణమిదేనా..?
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:16 AM
Telangana: ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది.
హైదరాబాద్, ఏప్రిల్ 13: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President KTR) రేపు (ఆదివారం) ఢిల్లీకి (Delhi) వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ (CBI) కస్టడీలో ఉన్న సోదరి కవితను (MLC Kavitha) కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సమయంలో కవితను కేటీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది.
Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...
నేడు కూడా విచారణ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిన్న(శుక్రవారం) తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి నుంచే కవిత సీబీఐ విచారణ మొదలైంది. నేడు కూడా సీబీఐ విచారణను కవిత ఎదుర్కోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లోధి రోడ్, జవహర్ లాల్ నెహ్రు మార్గ్‌లోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్స్‌పై కవతిను సీబీఐ ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి...
Patnam Sunita Mahender Reddy: నేను లోకల్.. రాగిడి నాన్‌లోకల్, డమ్మీ క్యాడిండేట్
తుపాకీ సిద్ధంగా ఉంది ఒక్క తూటా చాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..