DGP Jitender: అల్లు అర్జున్, మోహన్ బాబు ఇష్యూలపై.. డీజీపీ జితేందర్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:08 PM
సినిమా నటులు అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు ఘటనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.
కరీంనగర్: సినిమా నటులు అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు ఘటనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. బాధితులకు మేము సపోర్ట్ చేసి సాయం అందిస్తామని అన్నారు. హీరోలు స్థానిక పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించాలని అన్నారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య అని తెలిపారు. వాళ్ళు వాళ్లు మాట్లాడుకుంటే పర్వాలేదని అన్నారు. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు.