Share News

Madhavaram Krishna Rao: హైడ్రాపై అఖిలపక్ష సమావేశ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:54 PM

మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరిచిపోవద్దని అన్నారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

Madhavaram Krishna Rao: హైడ్రాపై అఖిలపక్ష సమావేశ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

హైదరాబాద్: హైడ్రాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే అఖిలపక్ష సమావేశానికి పిలుస్తామని ముఖ్యమంత్రి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రాపై అఖిలపక్ష సమావేశం.. ముందే పెట్టి ఉంటే బుచ్చమ్మ చనిపోయేది కాదని తెలిపారు. నల్లచెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చేసినవి ఆరోపణలు మాత్రమేనని.. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.


ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... నల్ల చెరువు చుట్టూ బీఆర్ఎస్ హయాంలో కట్ట కట్టామని తెలిపారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారులు కట్టను తొలగించారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో ఉంది విచారణ చేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కాజాకుంటలో ఇద్దరు జడ్జీలకు ఏపార్టీ నేతలు భూములు అమ్మారో సీఎం రేవంత్‌రెడ్డి విచారణ చేయించాలని అన్నారు.


మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరిచిపోవద్దని అన్నారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైడ్రా భాదితులకు అండగా బీజేపీ నుంచి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కరూ మాత్రమే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదండి.

నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

tela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2024 | 03:11 PM