Share News

Hyderabad: మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:39 PM

ఆస్తుల పంపకం విషయమై సినీ నటుడు మోహన్ బాబుతో కుమారుడు మనోజ్ గొడవకు దిగారని, అదే ఇంత పెద్దఎత్తున వివాదానికి దారి తీసిందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ మోహన్ బాబు ఇంటి పని మనిషి ఈ వివాదానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఘర్షణకు ఆస్తి విషయం కాదని ఆమె తేల్చి చెప్పారు.

Hyderabad: మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి
Manju Manoj Family

హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. పూటకో అప్ డేట్ వస్తోంది. తనపై దాడి జరిగిందంటే.. నాపై జరిగిందని మోహన్ బాబు- మనోజ్ అంటున్నారు. ఇంతలో మోహన్ బాబు ఇంటి పని మనిషి లైన్ లోకి వచ్చారు. వివాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. గొడవకుఆస్తి కారణం కాదని తేల్చి చెప్పారు. స్టాఫ్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం చెలరేగిందని, అది కాస్త చిలికి చిలికి గాలి వానలా మారిందని చెప్పుకొచ్చారు.


మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేశాడు. శనివారం రాత్రి అతనిపై మోహన్ బాబు దాడి చేశాడు. విషయం తెలిసిన మనోజ్ ఆదివారం ఉదయం ప్రసాద్‌పై దాడి చేయబోయారు. తన సిబ్బందిపై చేయి వేయొద్దని మనోజ్‌కి మోహన్ బాబు సూచించారు. తన సిబ్బందికి తానే భయంలో పెట్టుకుంటానని మనోజ్‌ను తోసేశారు. తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. స్టాఫ్ గురించే ఈ మొత్తం గొడవ జరిగింది. ఈ విషయంతోపాటు పాత విషయాలూ మనసులో పెట్టుకుని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకి ఏ మాత్రం ఇష్టం లేదు. గొడవలో మనోజ్‌కి ఎలాంటి గాయాలూ కాలేదు" అని పనిమనిషి స్పష్టం చేశారు.


కాగా, మంచు విష్ణు ఇవాళ (మంగళవారం) ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన రావడానికే ముందే నిన్నటి నుంచి మనోజ్, విష్ణు వర్గాలకు చెందిన బౌన్సర్లు పెద్దఎత్తున జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం జల్‌పల్లి నివాసానికి విష్ణు చేరుకోగా, ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. మనోజ్‌కు సంబంధించిన బౌన్సర్లను విష్ణు ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు. అలాగే విష్ణు బౌన్సర్ల సహాయంతో మనోజ్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ తనను ఇంటి నుంచి పంపిస్తుంటే అడ్డుకోలేదని మనోజ్ ఆరోపించారు. కాగా, వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నార్సింగ్ నుంచి మనోజ్ బయలుదేరారు. మరికాసేపట్లో డీజీపీ కార్యాలయానికి చేరుకుని మరోసారి ఫిర్యాదు చేయనున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 04:32 PM