Share News

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:15 PM

అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
Minister Jupalli Krishna Rao

హైదరాబాద్: అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు.


ప్రధాన మంత్రి పదవి కాళ్లదగ్గరకు వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఆరెండు పార్టీలు అంబేద్కర్ ఆయాశయాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన సాగుతుందనని కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు.

ఆ రోజు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ , బీజేపీ నాయకులకు విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అంబేద్కర్‌, రాజ్యాంగంపై వాళ్లకు విలువలు ఉంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందే వారే కదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల్లోనే కూలి పోతుందన్నారు. బీజేపీ‌తో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్‌ను కూల్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని మంత్రిజూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 03:16 PM