Share News

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో.. నిందితులపై కేసు నమోదు

ABN , Publish Date - May 23 , 2024 | 10:19 PM

తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌ లోగోను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో..  నిందితులపై కేసు నమోదు

ఖమ్మం జిల్లా: తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌ లోగోను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.


కొణతం దిలీప్‌, హరీశ్‌ రెడ్డి అనే వ్యక్తులపై ఐపీసీ 469,504, 505(1)(b)(c)తో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.తెలంగాణ ఆర్టీసీ సంబంధించి తప్పుడు లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఆ ప్రచారంలో వాస్తవం లేదు: సజ్జనార్

‘‘TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పటివరకు అధికారికంగా కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ ఇంకా రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’’ అని ఎక్స్ వేదికగా సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లోగోని ఇంకా క్రియేట్ చేస్తున్నామని, అది పూర్తయ్యాక తామే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పకనే చెప్పేశారు. అప్పటిదాకా ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు.

ఇదిలావుండగా.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’గా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే! ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో నివేదికలు, ఉత్తర్వులు, లెటర్‌ హెడ్‌లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తూ గెజిట్‌ జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. తొలుత వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్‌ తొలగించి టీజీగా మార్చింది. తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్‌ఆర్టీసీగా మార్పులు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 10:20 PM