Minister Nara Lokesh: మూడు నెలల్లో మేము ఇవ్వబోయే ఉద్యోగాలు ఇవే.. లోకేష్ ప్రకటన
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:58 PM
Minister Nara Lokesh: విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా: రాబోయే మూడు నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పదివేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్‌ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.25 కోట్లు, హుద్ హుద్ తుపాను సమయంలో మూడు కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తుచేశారు. భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పెదఅయినంలో రతన్‌టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫైర్ బ్యాండ్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. విద్యార్థులను చూస్తుంటే తన కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నది తన మిత్రులు, బంధువులు అనే చెప్పారు. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోట అన్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రియల్, రెస్పాన్సిబుల్ అండ్ రెబల్ అని కొనియాడారు. ఏ పోలీసులయితే ఆయనను కొట్టారో వారికి సొంత నిధులతో వాహనాలు కొనిచ్చారని చెప్పారు.
ఏపీ చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని... ప్రతీనెల రూ. 4 వేల కోట్లతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని విద్యార్థులు ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పారు. విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు. పాఠ్య పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు లేవు అని చెప్పారు. పార్టీల రంగులు లేవు, తమకు ఆ పిచ్చి లేదని అన్నారు. చట్టాల్లో కాదు..మార్పు రావాల్సింది అవగావన పెంచుకోవడంలో రావాలని అన్నారు. ఆడ, మగ విషయాల్లో సమానత్వం రావాలని చెప్పారు. పాఠ్యాంశాల్లో ఆ అంశాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ రూపొందించామని తెలిపారు. విద్యార్థులు అటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. డోంట్ బీ ముఖేష్ అంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
రతన్ టాటా మానవతావాది: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు
రతన్ టాటా మానవతావాది అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన మహా పారిశ్రామిక వేత్త అని చెప్పారు. సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహావిష్కరణ చేయాలని భావించామన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం రతన్ టాటాది అని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో స్థానికుల సహకారం అవసరమని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు.
దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయంగా రతన్ టాటా ఎదిగారు: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
రతన్ టాటా ప్రపంచ పారిశ్రామిక వేత్తల్లో దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయంగా ఎదిగిన వ్యక్తి అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసించారు. వ్యాపారం అంటే డబ్బు సంపాదించడమే కాదని చాటిచెప్పిన వ్యక్తి అని కొనియాడారు.అందుకే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించదన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఏ దేశం మాట్లాడినా, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ దేశానికైనా తన ఉత్పత్తులు ఆపేసిన వ్యక్తి రతన్ టాటా అని తెలిపారు. ఆయన చనిపోయినప్పుడు సాధారణ ప్రజలు కంటతడిపెట్టారని అన్నారు.
ఆయన విగ్రహం ఆవిష్కరణకు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు భరోసా ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఉద్ఘాటించారు. తాను గెలవాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఖచ్చితంగా చెప్పిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు అని తెలిపారు. సీఎం చంద్రబాబు రాజకీయంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు అని చెప్పారు. కాని అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో ఆయనకు ఎవరూ తక్కువ కాదని స్పష్టం చేశారు. మన మధ్య సమన్వయం దెబ్బతింటే, పార్టీల పరంగా మనకన్నా ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అన్నారు. సమన్వయం దెబ్భతింటే మళ్లీ సైకో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన
JC Prabhakar Reddy : ఆవేశంలో నోరుజారాను.. తప్పే!
Minister Nara Lokesh : వైసీపీ అక్రమాలపై త్వరలోనే యాక్షన్!
Read Latest AP News and Telugu News