Share News

Swami Srinivasananda: హిందూ ధర్మాన్ని నాశనం చేశారు.. జగన్‌పై శ్రీనివాసనంద సరస్వతీ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:35 PM

జగన్ ప్రభుత్వం ఏపీలో హిందూ ధర్మాన్ని నాశనం చేసిందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు బాధను కూడా బయటకు చెప్పుకోనివ్వకుండా పోలీసులతో కేసులు పెట్టించారని మండిపడ్డారు.హిందూ ధర్మంపై అఘాయిత్యాలు చేసిన వారు శంకగిరి మాన్యాలు పట్టారని ఎద్దేవా చేశారు. హైందవ శంఖారావానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.

 Swami Srinivasananda: హిందూ ధర్మాన్ని నాశనం చేశారు..  జగన్‌పై శ్రీనివాసనంద సరస్వతీ  సంచలన ఆరోపణలు
Swami Srinivasananda

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం ఏపీలో హిందూ ధర్మాన్ని నాశనం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో హైందవ శంఖారావు నిర్వహిచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, భావితరాలకు సనాతన ధర్మాన్ని అందించాలని చెప్పారు.వసుదైక కుటుంబం అనే భావనతో భక్తి భావం పెంపొందించాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయి, దేవతా విగ్రహాలు ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 320 ఆలయాలపై జగన్ జమానాలో దాడులు జరిగాయి, ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు.


ఆవేదనతో రోడ్డుమీదకు వస్తే.. వారిపైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. హిందూత్వాన్ని, హిందూ ధర్మాన్ని అణచివేసే కుట్రలను జగన్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. తిరుమల పవిత్రను కూడా నాశనం చేసి, వారి స్వార్థానికి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు. హిందువులు బాధను కూడా బయటకు చెప్పుకోనివ్వకుండా పోలీసులతో కేసులు పెట్టించారని మండిపడ్డారు.హిందూ ధర్మంపై అఘాయిత్యాలు చేసిన వారు శంకగిరి మాన్యాలు పట్టారని ఎద్దేవా చేశారు. హైందవ శంఖారావానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.


కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచేలా అమరావతి ప్రాంతం కళకళలాడాలని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు మొత్తం పునర్నిర్మాణం జరగాలని కోరుకున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ రేపు శంఖారావ సభలో కలుస్తామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తిరుమల ప్రక్షాళన ఇప్పటికే ప్రారంభమైందని. ఇతర ఆలయాల్లో కూడా ఈ మార్పురావాలని అన్నారు. హిందూ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిపై రేపు చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..

Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ

AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 04 , 2025 | 05:42 PM