Share News

YS Sharmila: అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు... షర్మిల ధ్వజం

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:50 AM

YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila: అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు... షర్మిల ధ్వజం
YS Sharmila

అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమిత్ షా పర్యటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు. అమిత్ షా వైఖరీకి నిరసనగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తక్షణం మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమని వైఎస్ షర్మిల అన్నారు.


నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని విమర్శించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, క్షమాపణలు చెప్పాలని అడగకుండా, అతిథి మర్యాదలు చేసే వాళ్లు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. వారితో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్నాయని వైఎస్ షర్మిల ఆక్షేపించారు. కూటమిలోని టీడీపీ, జనసేనలను, అలాగే వైసీపీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ ప్రజల మీద కూటమి నేతలకు గౌరవం ఉంటే అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 18 , 2025 | 10:58 AM