Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం
ABN , Publish Date - Feb 05 , 2025 | 07:05 PM
నువ్వా-నేనా అనే రీతిలో 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల' యుద్ధం ముగిసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మరోవైపు.. పోలింగ్ ముగిసిన క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి.

న్యూఢిల్లీ: నువ్వా-నేనా అనే రీతిలో 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల' యుద్ధం ముగిసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మరోవైపు.. పోలింగ్ ముగిసిన క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రానున్నట్టు మెజారిటీ 'ఎగ్జిట్ పోల్స్' అంచనా వేశాయి. ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీ ఉంటుందని మ్యాట్రిజ్ సంస్థ చెప్పింది. కాంగ్రెస్ మాత్రం ఒకటి, రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తేల్చేశాయి.
Delhi Assembly Elections: ఎగ్జిట్ పోల్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ ఓటరులు జై కొట్టింది ఎవరికంటే..
ప్రధాన సర్వే సంస్థలు ఏం చెప్పాయి?
ప్రధాన సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, జేవీసీ, పీ-మార్క్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్ సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి.
పీపుల్ పల్స్: బీజేపీకి 51-60, ఆప్ 10-19, కాంగ్రస్ - జీరో
మ్యాట్రిజ్ : బీజేపీకి 35-40, ఆప్ 32-37, కాంగ్రెస్ 0-1
జేవీసీ : బీజేపీ 39-45, ఆప్ 22-23, కాంగ్రెస్ 0-2
పీ-మార్క్: బీజేపీ 39-49, ఆప్ 21-31, కాంగ్రెస్ 0-1
పీపుల్స్ ఇన్సైట్ : బీజేపీ 40-44, ఆప్ 25-29, కాంగ్రెస్ 0-1
ఛాణక్య స్ట్రాటజీస్ : బీజేపీ 39-44, ఆప్ 25-28, కాంగ్రెస్ 2-3
పోల్ డైరీ : బీజేపీ 42-50, ఆప్ 19-25, కాంగ్రెస్ 0-2