Viral: రూ.7కోట్ల జీతంతో భర్తకు ప్రమోషన్.. విడాకులు ఇస్తున్నానంటూ భార్య షాక్.. కారణమేంటో తెలిస్తే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:53 AM
తన భర్త జీవితంలోఉన్నత స్థానానికి రావాలని భార్య కోరుకుంటూ ఉంటుంది. అలాంటిది ఇక తన భర్తకు రూ.7కోట్ల జీతంతో ప్రమోషన్ కూడా వచ్చిందంటే.. ఇక ఆ భార్య సంతోషం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ భార్య మాత్రం తన భర్తకు విడాకులు ఇచ్చింది.. వివరాల్లోకి వెళితే..

తన భర్త జీవితంలోఉన్నత స్థానానికి రావాలని భార్య కోరుకుంటూ ఉంటుంది. భర్త బాగా సంపాదిస్తుంటే పది మందికీ గర్వంగా చెప్పుకొని మురిసిపోతుంది. అలాంటిది ఇక తన భర్తకు రూ.7కోట్ల జీతంతో ప్రమోషన్ కూడా వచ్చిందంటే.. ఇక ఆ భార్య సంతోషం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ అలా జరగలేదు. సంతోషపడాల్సిన భార్య కాస్తా.. సంచలన నిర్ణయం తీసుకుంది. విడాకులు ఇస్తున్నానంటూ భర్తకు సడన్ షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. డేనియల్ వస్సల్లో అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ ప్రముఖ టెక్, ఇ-కామర్స్ కంపెనీలో చేరాడు. అప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్ కోసం తన బాస్‌కు విన్నవించుకున్నాడు. అప్పటి నుంచి అతడిపై పని ఒత్తిడి మరింత పెరిగింది. ఉదయం 7గంటలకు ఆఫీసుకు వెళ్తే రాత్రి 9వరకూ 14 గంటల పాటూ పని చేసి ఇంటికి వెళ్లేవాడు.
Women Viral Video: ఫ్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకున్న మహిళ.. షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి..
ఎక్కువ సమయం ఆఫీసులో పని చేస్తుండడంతో కనీసం భార్యతో సంతోషంగా గడిపే సమయం కూడా ఉండేది కాదు. దీంతో దంపతుల మధ్య సమస్యలు మొదలయ్యాయి. అయినా భర్త మాత్రం ప్రమోషన్ లక్ష్యంగా అధిక సమయంలో ఆఫీసులోనే గడుపుతూ కష్టపడేవాడు. ఇలా కొన్ని నెలల శ్రమ తర్వాత అతడి కల సాకారమైంది. రూ.7.8 కోట్ల జీతంలో సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి (Promotion) లభించింది. దీంతో పాటూ అతడికి కూతురు పుట్టిందంటూ మరో శుభవార్త కూడా తెలిసింది.
Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..
ప్రమోషన్ వార్తను భార్యతో షేర్ చేసుకుందామని ఇంటికి వచ్చిన అతడికి పెద్ద షాక్ తగిలింది. అప్పటికే భర్త నిర్వాకంతో విసిగిపోయిన భార్య.. ప్రసవానంతంర మరింత డిష్రెషన్‌కు గురైంది. భర్తతో సంతోషంగా ఉండలేకపోతున్నానని, తనకు విడాకులు కావాలని (wife divorces her husband) అడగడంతో భర్త ఖంగుతిన్నాడు. సంతోషకర సమయంలో భార్య నుంచి ఇలాంటి సమాధానం రావడాన్ని భరించలేకపోయాడు. తనకు ఎదురైన ఈ ఛేదు అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..