Viral Video: రోగిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్న సిబ్బంది.. లిఫ్ట్‌లో ఎక్కిస్తుండగా..
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:00 PM
ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చి ప్రాణాలతో తిరిగి వెళ్లిన వారిని చూశాం. అలాగే వైద్యం కోసం వచ్చి అనుకోని ప్రమాదాల బారిన పడిన వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా..

ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చి ప్రాణాలతో తిరిగి వెళ్లిన వారిని చూశాం. అలాగే వైద్యం కోసం వచ్చి అనుకోని ప్రమాదాల బారిన పడిన వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆస్పత్రిలో రోగిని ఆపరేషన్ కోసం తీసుకెళ్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ రోగిని ఆపరేషన్ చేసేందుకు సిద్ధం చేస్తారు. రోగిని స్టెచర్‌పై (Patient on stretcher) పడుకోబెట్టి లిఫ్ట్‌లో ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోకి తీసుకెళ్తుంటారు. లిఫ్ట్ డోరు తెరుచుకోగానే స్ట్రెచర్‌ను అందులోని తీసుకెళ్లాలని చూస్తారు.
Women Viral Video: ఫ్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకున్న మహిళ.. షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి..
అయితే సగం లోపలికి తీసుకెళ్లగానే ఒక్కసారిగా (Collapsed lift) లిఫ్ట్ కిందకు దిగిపోతుంది. దీంతో సగం స్ట్రెచర్ లోపల, సగం స్ట్రెచర్ బయట ఉంటుంది. స్టెచర్ ఒక్కసారిలో కిందకు పడడంతో రోగి కూడా ధబేల్‌మని తలకిందులుగా పడిపోతాడు. ఈ ఘటనలో రోగి మరణించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘లిఫ్ట్‌ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 56 వేలకు పైగా లైక్‌లు, 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా.. సీటు దొరకలేదని ఇతనేం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..