Viral Video: అది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా.. సీటు దొరకలేదని ఇతనేం చేశాడో చూడండి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 08:33 PM
ఓ వ్యక్తి రద్దీగా ఉన్న బస్సు ఎక్కేశాడు. అయితే లోపల ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో సీటు దొరకలేదు. సాధారణంగా బస్సులో సీటు దొరక్కపోతే ఎవరైనా నిలబడి ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇతను మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు..

బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. మరికొందరు సీట్ల కోసం కుస్తీలు పడుతుంటారు. ఈ క్రమంలో చోటు చేసుకునే సంఘటనలు అందరినీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బస్సు ఎక్కిన ఓ వ్యక్తి అందులో సీటు దొరక్కపోవడంతో చివరకు విచిత్రంగా ప్రవర్తించాడు. ఇతడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘అది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న బస్సు ఎక్కేశాడు. అయితే లోపల ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో సీటు దొరకలేదు. సాధారణంగా బస్సులో సీటు దొరక్కపోతే ఎవరైనా నిలబడి ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇతను మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు.
సీటు లేకపోతేనేం లగేజీ ర్యాక్ ఉంది కదా అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా (man sleeping on Bus Luggage Compartment) దానిపైకి ఎక్కి తాపీగా పడుకున్నాడు. రైల్లో లగేజీ ర్యాక్‌పై పడుకుని ప్రయాణం చేసిన చందంగా.. ఇతను ఇలా బస్సులో పడుకుని ప్రయాణం చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మామూలు బస్సును కాస్తా.. స్లీపర్ కోచ్ బస్సుగా మార్చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘మహారాష్ట్రలో ఇలాంటి తెలివితేటలకు కొదవే లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Bull Funny Video: ఎద్దును భయపెట్టాలని చూశారు.. చివరికి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..