Women Viral Video: ఫ్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకున్న మహిళ.. షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 09:25 PM
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండి తీరాల్సిన పరిస్థితి. కొందరైతే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఫోన్ పక్కనే పెట్టుకుని ఉంటారు. మరికొందరు ఏ పనిలో ఉన్నా కూడా ఫోన్‌ను జేబులో పెట్టుకునే ఉంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండి తీరాల్సిన పరిస్థితి. కొందరైతే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఫోన్ పక్కనే పెట్టుకుని ఉంటారు. మరికొందరు ఏ పనిలో ఉన్నా కూడా ఫోన్‌ను జేబులో పెట్టుకునే ఉంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ జేబులో ఫోన్ పెట్టుకుని షాపింగ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్తుంది. ఆ సమయంలో ఫోన్‌ను ఫ్యాంట్ వెనుక జేబులో పెట్టుకుని ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా ఫ్యాంట్ జేబులోని (phone exploded in pant pocket) ఫోన్ పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి. దీంతో ఆమె ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది.
Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..
మంటలు ఎలా ఆర్పేయాలో తెలీక అటూ, ఇటూ పరుగెడుతూ ఉంటుంది. పక్కన ఉన్న వారు కూడా కంగారుపడిపోయి చూస్తుంటారు. అయినా అక్కడున్న వారంతా ఆమెకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరకు ఎలాగోలా మంటలు ఆర్పి, ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. పేలిన ఫోన్ Motorola Moto E32 అని తెలిసింది.
Viral Video: అది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా.. సీటు దొరకలేదని ఇతనేం చేశాడో చూడండి..
ఈ ఫోన్‌ను ఏడాది క్రితం కొనుగోలు చేసినట్లు బాధితురాలు తెలిపింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలా జరిగేందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్‌ను జేబులో పెట్టుకోవాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..