Share News

Bull Funny Video: ఎద్దును భయపెట్టాలని చూశారు.. చివరికి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Feb 13 , 2025 | 07:42 PM

ఇద్దరు ఆకతాయిలు ఎద్దుకు స్నానం చేయించాలని పెద్ద కాలువ వద్దకు తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో దాన్ని నీటిలోకి తీసుకెళ్లి భయపెట్టాలని అనుకుంటారు. వారిద్దరిలో ఓ యువకుడు ముందే నీటిలో మునిగి ఉంటాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Bull Funny Video: ఎద్దును భయపెట్టాలని చూశారు.. చివరికి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కొందరు జంతువులతో తమాషా చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు వాటిని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ వేడుక చూస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి కొన్ని జంతువులు తగిన విధంగా బుద్ధి చెబుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ ఎద్దు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు ఆకతాయిలు ఎద్దును నీళ్లలోకి తీసుకెళ్లి భయపెట్టాలని చూశారు. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు ఆకతాయిలు ఎద్దుకు స్నానం చేయించాలని పెద్ద కాలువ వద్దకు తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో దాన్ని నీటిలోకి తీసుకెళ్లి (young man scared the bull) భయపెట్టాలని అనుకుంటారు. వారిద్దరిలో ఓ యువకుడు ముందే నీటిలో మునిగి ఉంటాడు. మరో వ్యక్తి ఎద్దును పట్టుకుని నీళ్లలోకి తీసుకొస్తాడు.

Student Funny Video: క్లాస్ బంక్ కొట్టేందుకు పైనుంచి దూకేశాడు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అయితే తీరా ఎద్దు నీళ్లలోకి రాగానే.. లోపల ఉన్న వ్యక్తి సడన్‌గా పైకి లేచి దాన్ని భయపెడతాడు. నీళ్లలో మునిగిన వ్యక్తి ఇలా సడన్‌గా పైకి లేవడంతో ఎద్దు ఒక్కసారిగా భయపడిపోతుంది. ఈ క్రమంలో పైకి లేచి వెనుక కాళ్లతో (bull kicked young man) అతన్ని ఒక తన్ను తన్నుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. ఇలా తనను భయపెట్టాలని చూసిన యువకులకు ఎద్దు తగిన విధంగా బుద్ధి చెప్పడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Leopards Viral: పొలాల్లోకి చొరబడ్డ చిరుతలు.. కెమెరా జూమ్ చూసి చూడగా షాకింగ్ సీన్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మూగజీవాలను ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎద్దు బాగా బుద్ధి చెప్పిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 54 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 13 , 2025 | 07:42 PM