MP Raghurama: సింహం ఎవరో నిన్నటితో తేలిపోయింది.. రోజులు దగ్గర పడ్డాయి
ABN , First Publish Date - 2023-02-18T14:32:08+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
న్యూఢిల్లీ: వైసీపీ ప్రభుత్వం (YCP Government)పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు (Narsapuram MP Raghuramakrishnaraju) రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా అనపర్తిలో చంద్రబాబు (TDp Chief Chandrababu) పర్యటనకు అడ్డంకులు సృష్టించడం, మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar)ను పోలీస్‌స్టేషన్‌లో నేలపై కూర్చోబెట్టడంపై ఎంపీ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఫ్రస్టేషన్‌కు లోనవుతుందని యెద్దేవా చేశారు. ‘‘మా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.. మాకు చెడ్డ రోజులు దగ్గర పడ్డాయి..రాష్టానికి మంచి రోజులు రానున్నాయి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉన్మాద చర్యలు ఆపుతారని నమ్మకం లేదన్నారు. చీకటి జీవోకు కాలం చెల్లుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జవహర్ (Former Minister)ను పోలీసు స్టేషన్‌లో కింద కూర్చోబెట్టారని... మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మంచిదికాదన్నారు. అసలు బుగ్గన (Minister Buggana Rajendranath Reddy) కు ఏమైందని ప్రశ్నించారు. బెంగుళూరు (Banglore)లో ఒకలా... మద్రాసు (Madras)లో మరోలా మాట్లాడుతారని విమర్శించారు. జగన్ ఏమైనా చేసి అప్పులు తీసుకురావాలని చేసే ఒత్తిడికి బుగ్గనకు చిప్పు చితికిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు బిల్లు (Three Capital Bill) వెనక్కి తీసుకోమని బుగ్గన అంటున్నారని... అసలు రాజధానుల బిల్లు పెట్టే అర్హత లేదని హైకోర్టు చెప్పిందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.
ఏడు కిలోమీరట్లు నడిచిన వాడు ముసలోడవుతాడా?...
అనపర్తి (Anaparthy)లో నిన్న అరాచకం చూశామని.. ఏంటి ఈ దారుణమని ప్రశ్నించారు. నిన్నటి ఘటన ఒకరకంగా చంద్రబాబు (TDP Chief) పై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందని తమ పార్టీ నేతల అరుపులు ఎక్కువయ్యాయన్నారు. ‘‘నేను సింహాన్ని అని జగన్ (AP CM) ఆయనకు ఆయనే డిక్లేర్ చేసుకున్నారు. నిన్న చంద్రబాబు (TDP) ను ట్రాక్టర్లు, బండ్లు అడ్డం పెట్టీ ఆపేశారు. చంద్రబాబు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఏడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. పరదాల చాటున బిక్కు బిక్కుమంటూ వచ్చే వాడిని సింహం అంటారా?.. లేక 7 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చి మరీ సభను పెట్టిన వారిని సింహం అంటారా? సింహం ఎవరో నిన్నటితో తేలిపోయింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జగన్ ముసలోడు అని అంటారని... 7 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అతను ముసలోడు అవుతాడా అని ప్రశ్నించారు. కొబ్బరి కాయ కొట్టడానికి ఒంగలేని వాడు యువకుడు ఎలా అవుతారని నిలదీశారు. ఎవరు యువకుడు, ఎవడు ముసలోడో తేలిపోయిందన్నారు.
పోలీసు సహాయ నిరాకరణ ఉద్యమం ఎక్కడ చూడలేదని.. నిన్నటి ఘటన దురదృష్టకమని అన్నారు. ప్రజాస్వామ్య వాదులు అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో పరిపాలనలో ఉన్న పార్టీ అధ్యక్షుడు ఏపీలో ఉన్నవారు స్పందించాలన్నారు. రేపు వాళ్ళ పార్టీ నేతలు వస్తే సమావేశానికి ఇలాంటి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అన్ని పార్టీల నేతలో పాటు తమ వైసీపీ నేతలు కూడా ఖండించాలన్నారు. అప్రజాస్వామిక వాదానికి చరమగీతం పాడాలన్నారు. ఏపీ ప్రజల కోపానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అనేది నిన్నటితో తేలిపోయిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.