Gudivada Amarnath: లోకేష్.. నీ స్థాయి ఏంటి.. నీ బతుకేంటి..?
ABN , First Publish Date - 2023-09-16T20:45:20+05:30 IST
దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు(Chandrababu) అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్‌కు సవాల్ విసిరే స్థాయి లోకేష్(LOKESH)కు లేదు. నీ స్థాయి ఏమిటి..నీ బతుకేంటీ.చర్చకు రమ్మని ఈడీ, సీఐడీ incometax చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.
విశాఖపట్నం: దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు(Chandrababu) అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్‌కు సవాల్ విసిరే స్థాయి లోకేష్(LOKESH)కు లేదు. నీ స్థాయి ఏమిటి..నీ బతుకేంటీ.చర్చకు రమ్మని ఈడీ, సీఐడీ incometax చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.వాటికి ముందు సమాధానం చెప్పు.118 కోట్లుకు సంబంధించి incomtax పిలిస్తే తప్పించుకొని తిరుగుతున్నారు. 371 కోట్లు ప్రజాధనాన్ని చంద్రబాబు, లోకేష్ తినేసి మాట్లాడుతున్నారు.నెక్స్ట్ లోకేష్‌నే జైల్‌కు వెళ్లేది.రెండు ఎకరాల నుంచి 680 కోట్లు ఎలా సంపాదించారు.పవన్ కళ్యాణ్ నకిలీ కాపు.పవన్ చెపితే కాపులు ఎందుకు తెలుగుదేశానికి ఓటు వేస్తారు.కాపులకు చంద్రబాబు చేసింది ఏమిటో చెప్పాలి.ముద్రగడ పద్మనాభం కుటంబాన్ని చంద్రబాబు వేదిస్తే పవన్ ఎందుకు మాట్లడలేదు.చిరంజీవిని రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో(airport) అరెస్ట్ చేస్తే పవన్ ఎందుకు ఖండించలేదు.కాపు ప్రముఖులు సమావేశమైతే పవన్ ఎందుకు వెళ్లలేదు.చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెడితే కాపులు ఎందుకు టీడీపీకి ఓట్లు వేస్తారు. పవన్ సినిమాల్లో యాక్టింగ్, రాజకీయాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు.మీ పార్టీ విలీనం చేసి ఒక జెండా పెట్టుకోవచ్చు కదా.జన సైనికులు జెండా కూలీలు.ఒక దొంగని కాపాడటానికి తోడు దొంగలు.అసెంబ్లీలో చర్చకు సిద్ధం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.