Rahul Gandhi : మరో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ?

ABN , First Publish Date - 2023-03-25T18:52:28+05:30 IST

దివంగత వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar)ను అవమానిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi : మరో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ?
Rahul Gandhi , Eknath Shinde

ముంబై : దివంగత వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar)ను అవమానిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Maharashtra chief minister Eknath Shinde) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ కొన్ని నెలల క్రితం సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసన సభలో నిరసన వ్యక్తమైంది. రాహుల్ పోస్టర్లను అధికార పార్టీ సభ్యులు చెప్పులతో కొట్టారు. ఈ నేపథ్యంలో సీఎం షిండే శాసన సభలో మాట్లాడుతూ, వినాయక్ దామోదర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాకుండా యావత్తు భారత దేశానికి దేవుని వంటివారని చెప్పారు. అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ కించపరిచారన్నారు. రాహుల్ చేసిన పనికి ఎంతగా విమర్శించినా తక్కువే అవుతుందన్నారు.

రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్‌వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టేవారన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోరేవారని చెప్పారు. బ్రిటిష్ పాలకుల నుంచి పింఛను కూడా స్వీకరించారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన సాయపడ్డారన్నారు. ఆయన శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తన పేరు సావర్కర్ కాదని, తన పేరు గాంధీ అని, గాంధీ క్షమాపణ చెప్పబోరని అన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరో పరువు నష్టం కేసును ఎదుర్కొనవలసి వస్తుందేమోనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-25T18:52:28+05:30 IST