Share News

Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..

ABN , Publish Date - Sep 07 , 2024 | 09:33 AM

వినాయక చవితి పండగ వేళ తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మహిళ క్యూలైన్‌లో గుండెపోటుతో మృతిచెందింది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.

Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..

తిరుమల: వినాయక చవితి పండగ వేళ తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మహిళ క్యూలైన్‌లో గుండెపోటుతో మృతిచెందింది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.


కడపకు చెందిన ఝాన్సీ అనే మహిళ కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చారు. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద గంటల తరబడి లైన్‌లో నిల్చున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి కుప్పకూలింది. ఏం జరిగిందో అర్థం కాని తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నర్సులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఝాన్సీకి సీపీఆర్ మెుదలుపెట్టారు.


ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. అయితే ఈ లోపే సమాచారం అందించినా అంబులెన్స్ గంట లేటుగా వచ్చింది. అనంతరం బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో మృతురాలి తండ్రి బోరున విలపించారు. తన కూతురికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని, వారి పరిస్థితి ఏంటని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంబులెన్స్ వెంట వెళ్లిన తోటి భక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అంబులెన్స్ గంట లేటుగా రావడంపై మహిళ తండ్రి, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ లేటుగా రావడం వల్లే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Ganesh Chaturthi: గణనాధుడికి ఘనంగా పూజలు..

Updated Date - Sep 07 , 2024 | 10:38 AM