Share News

Srikanth Reddy: ఆ కేసులో మాజీ మంత్రిని టార్గెట్ చేశారు

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:21 PM

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) ఆరోపించారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు.

Srikanth Reddy: ఆ కేసులో మాజీ మంత్రిని టార్గెట్ చేశారు
Gadikota Srikanth Reddy

తాడేపల్లి: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) ఆరోపించారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని ఈ విచారణ జరుగుతోందని చెప్పారు. అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారని చెప్పారు.


అతను టీడీపీ సానుభూతి పరుడు కాదా..? అని ప్రశ్నించారు. అంతమాత్రాన అతని ద్వారా చంద్రబాబుకు సంబంధం ఉందని తాము చెప్పలేము కదా..? అని నిలదీశారు. రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తల్లికివందనం అడ్రెస్ లేదని విమర్శించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ. 15 వందలు ఇచ్చేదెప్పుడు? అని నిలదీశారు. ఏ పథకాన్నీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదని ధ్వజమెత్తారు. తమ వైపు తప్పులు ఉంటే సూచించాలని అన్నారు. అలా కాకుండా కేవలం బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దని హితవు పలికారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని గడికోట శ్రీకాంత్ రెడ్డి సూచించారు.


మరో ఎనిమిది కేసులు నమోదు

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసుకు (Madanapalle Incident) అనుసంధానంగా మరో ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎనిమిది కేసులు ఏమిటి..? ఎవరి మీద నమోదు చేశారు..? అన్న ప్రశ్నలు మదనపల్లె ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 21వ తేదీ రాత్రి మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం విదితమే. దీనిపై సీఐడీ సహకారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.


ఇప్పుడిప్పుడే..!

ఇదే సమీక్షలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. బాధితులు అంత మంది ఉంటారని, సాక్ష్యాధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారనే విషయాన్ని అస్సలు ఊహించలేదని.. తాను ఇచ్చిన ఒకే ఒక్క సందేశానికి అనూహ్య స్పందన వచ్చిందని చంద్రబాబుకు నిశితంగా వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ మొత్తం ఘటనలో గత ప్రభుత్వంలో వ్యవహరించిన కొందరు పెద్దలు ప్రమేయానికి సంబంధించిన అంశాలన్నీ ముడిపడి ఉన్నాయని ఇప్పుడిప్పుడే తేలుతోంది. అందుకే ఇక ఈ కేసును సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి చూస్తే.. ఈ కేసు అతి త్వరలోనే తేలిపోనుందని మాత్రం చెప్పుకోవచ్చు.


ఎవరా 8 మంది..!

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు అనుసంధానంగా మరో ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది కేసులు ఏమిటి..? ఎవరి మీద నమోదు చేశారు..? అన్న ప్రశ్నలు మదనపల్లె ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 21వ తేదీ రాత్రి మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం విదితమే. దీనిపై సీఐడీ సహకారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.


అదే జరిగితే..?

ఈ క్రమంలో డీఐజీ ప్రవీణ్‌ మదనపల్లెలో ఇచ్చిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో ఉండకూడని పత్రాలు దొరికినట్లు, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో పాటు 52 మందిని విచారించగా, అందులో 15 మంది అనుమానితులను విచారించి సోదాలు చేశామన్నారు. వారి వద్ద ఉండకూడని కీలకపత్రాలు స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమెదు చేశామన్నారు. వాస్తవంగా ఏదైనా నేరం జరిగితే ఆ నేరం చేసిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన, సాక్ష్యాలు, ఆధారాలు చెరిపేందుకు, దాచిపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసు కాస్పరసి సెక్షన్‌ 120-బి (కూడగట్టుకుని నేరం చేసిన) కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైళ్ల దహనంపై మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 135/2024 కింద నమోదైన కేసుకు, ఈ ఎనిమిది కేసులు కూడా తోడవుతాయనే కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే 15 మంది అనుమానితుల్లో ఎవరిపై ఎనిమిది కేసులు నమోదు చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Aug 01 , 2024 | 05:43 PM