Chandrababu: పోలీస్ శాఖలో ప్రక్షాళన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 21 , 2024 | 06:19 PM
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)తో డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు.
అమరావతి: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)తో డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగ కుండా చూసుకోవాలని ఏపీ సీఎం ఆదేశించారు.
త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. అనంతరం సచివాలయం నుంచి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు.