CM Chandrababu: సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.. ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ కంపెనీలు
ABN , Publish Date - Sep 10 , 2024 | 05:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురవడంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. పలువురి ఇళ్లల్లోని వస్తువులు నీటికి కొట్టుకుపోగా.. మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురవడంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. పలువురి ఇళ్లల్లోని వస్తువులు నీటికి కొట్టుకుపోగా.. మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల సమస్యలను అధికారులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) దృష్టికి తీసుకెళ్లారు.
ALSO READ:Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే ఈరోజు(మంగళవారం) ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయా కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడను వరదలు ముంచెత్తాయని.. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
వాటి రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులు బాధితులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రజల ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసి పాడైపోయాయని చెప్పారు. కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధితుల ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడానికి ముందుకు రావాలని సూచించారు. స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్‌లో అందించాలని విన్నవించారు. ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదిక మీదకు వచ్చి సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
ఇప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులు స్పందించే తీరే కస్టమర్లలో ఆ కంపెనీ బ్రాండ్ నిలబడేలా చేస్తుందని అన్నారు. కంపెనీల వారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు విన్నవించారు. వారం రోజులు టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కంపెనీల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తితో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సర్వీస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలు అందజేస్తామని కంపెనీల ప్రతినిధులు బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News