Share News

Rammohan Naidu: మైక్రోసాఫ్ట్ సమస్య.. విమాన సేవలు నిలిచిపోకుండా కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 07:12 PM

మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు.

 Rammohan Naidu: మైక్రోసాఫ్ట్  సమస్య.. విమాన సేవలు నిలిచిపోకుండా కీలక ఆదేశాలు
Minister Ram Mohan Naidu Kinjarapu

శ్రీకాకుళం: మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య కారణంగా పౌరవిమాన యాన శాఖకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

Ram-Mohan-Naidu-Kinjarapu-3.jpg


కొద్దిసేపటి క్రితం విమానయాన శాఖ అధికారులతో మాట్లాడానని వివరించారు. విమానయాన రంగంపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇచ్చాపురంలో ఈరోజు(శుక్రవారం) కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చాలా పనుల్లో డొల్లతనం సమీక్షల్లో బయటపడుతుందని అన్నారు.

Ram-Mohan-Naidu-Kinjarapu-4.jpg


ఇరిగేషన్, రూరల్ వాటర్ స్కీమ్, పంచాయతీరాజ్, పథకాల్లో గతంలో మంజూరైన నిధులు పనులకు పొంతన లేదని చెప్పారు. ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హడావిడి చేశారని అన్నారు. 400 గ్రామాలకు మంచి నీరు అందితుందని.. ఇంకా 700 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని తెలిపారు. జిల్లా దశ దిశను మార్చే నదుల అనుసంధానంపై ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Ram-Mohan-Naidu-Kinjarapu-1.jpg


తొలిసారి ఇచ్ఛాపురంలో పర్యటన

‘‘కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు (శుక్రవారం) తొలిసారి తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇచ్ఛాపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చాం. మాకు సాదరంగా ఆహ్వానం పలికిన కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ స్వేచ్ఛ వతి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఇచ్ఛాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బెందాళం అశోక్‌తో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించాం. మున్సిపాలిటీ, మండలంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలిసి సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాతోపాటు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ దాసరిరాజు గారు, మున్సిపల్ చైర్మన్ గారు ముఖ్య అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 07:12 PM