Visakha: రుషికొండ భవనాల నిర్మాణం పిచ్చి పని: అశోక్ గజపతిరాజు ఆగ్రహం..
ABN , Publish Date - Dec 15 , 2024 | 06:46 PM
సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు.
విశాఖపట్నం: వైసీపీ హయాంలో రుషికొండ భవనాల (Rushikonda Buildings) నిర్మాణం ఓ పిచ్చిపనంటూ సింహాచలం దేవస్థానం ఛైర్మన్, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి దేనికీ పనికి రాకుండా భవనాలు కట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పాలనలో పెద్దఎత్తున ప్రజాధనం వృథా చేశారంటూ గజపతిరాజు మండిపడ్డారు.
Eluru: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పెళ్లి చేయాలంటూ ఏకంగా కత్తితో..
సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలు పిచ్చి పనికి చిహ్నంగా మిగిలిపోయానని ఆయన ఎద్దేవా చేశారు. భవనాలను అలాగే ఉంచాలని, వాటిని పిచ్చి ఆస్పత్రిగా మార్చితే మంచిదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందులో పిచ్చి వాళ్లను ఉంచితే భవనాల్లోంచి సముద్రాన్ని చూస్తూ ఆస్వాదిస్తారని అన్నారు.
B tech Ravi: వైఎస్ అవినాష్ రెడ్డిపై బిటెక్ రవి ఘాటు వ్యాఖ్యలు
వైఎస్ జగన్ పాలన అంతా సైకో పాలనేనని గజపతిరాజు ధ్వజమెత్తారు. రుషికొండ భవనాలను ఏం చేయాలో ప్రజాభిప్రాయం సేకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు గత టీడీపీ హయాంలో అమరావతిలో సచివాలయాన్ని నిర్మిస్తే.. జగన్ దాన్ని రూ.375 కోట్లకు తాకట్టుపెట్టారని ఆయన మండిపడ్డారు. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారంటూ గజపతిరాజు ప్రశ్నించారు. సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: వారివి అన్నీ దొంగ బుద్దులే.. అన్నీ దొంగ నాటకాలే: సీఎం చంద్రబాబు..
Budda Venkanna: జీతాలు తీసుకుంటూ గొర్రెలు కాస్తున్నారా.. ఆ ఎమ్మెల్యేలపై బుద్దా ఫైర్..