Share News

Viral video: వేటాడే ముందు సాలీడు ఏం చేస్తుందో ఎప్పుడైనా చూశారా.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:15 PM

పులులు, సింహాలు తదితర జంతువులు ఎలా వేటాడతాయో అందరికీ తెలుసు. వేటకు ముందు అవి చేసే పనులు కూడా తరచూ చూస్తుంటాం. అయితే సాలీడు వేట ఎలా ఉంటుందో చాలా ...

Viral video: వేటాడే ముందు సాలీడు ఏం చేస్తుందో ఎప్పుడైనా చూశారా.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..

పులులు, సింహాలు తదితర జంతువులు ఎలా వేటాడతాయో అందరికీ తెలుసు. వేటకు ముందు అవి చేసే పనులు కూడా తరచూ చూస్తుంటాం. అయితే సాలీడు వేట ఎలా ఉంటుందో చాలా తక్కువ మందికి చూసుంటారు. వేటను టార్గెట్ చేసే సాలీడు దాన్ని ఎలా ట్రాప్ చేస్తుందో తెలియజేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సాలీడు వేటను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సాలీడు (spider) ఎలా వేటాడుతుందో అందరికీ చూపించాలని అనుకున్నాడు. ఇందుకోసం అతను ఓ సాలీడు గూడును ఎంచుకుని, దానికి ఓ వేటను కూడా సిద్ధం చేశాడు. ఓ కీటకాన్ని పట్టుకుని సాలీడుకు దగ్గరగా తీసుకెళ్తాడు. తన గూడుకు సమీపంగా వచ్చిన కీటకాన్ని.. సాలీడు వెంటనే లోపలికి లాగేసుకుంటుంది. చాలా సేపు దానిపై (Spider attack on wasp) కాళ్లతో పొడుస్తూ దాన్ని సాలెగూడులో చుట్టేస్తుంది.

Viral video: నరాలు తెగే ఉత్కంఠ.. జిరాఫీని చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


చాలా సేపు కీటకాన్ని రౌండ్లు తిప్పుతూ.. చివరకు దాన్ని బతికున్న మమ్మీలా మారుస్తుంది. చాలా సేపు తప్పించుకోవాలని చూసిన కీటకం.. చివరకు సాలె గూడులో చిక్కుని విలవిల్లాడిపోతుంది. సాలె గూడులో చుట్టిన తర్వాత సాలీడు మరో వేట కోసం పక్కకు వెళ్లిపోతుంది. ఇలా తన వేటను గూడులో చుట్టేసి స్టోర్ చేసి పెట్టుకుందన్నమాట. సదరు వ్యక్తి ఈ ఘటనను మొత్తం రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ సాలీడు వేట భయంకరంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘కీటకాన్ని చివరకు మమ్మీలా మార్చేసిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 39 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

Updated Date - Jun 27 , 2024 | 04:15 PM