Share News

Viral video: నిద్రిస్తుండగా బాలుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:59 PM

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని పాములు ఇళ్లల్లోకి దూరిపోతుంటాయి. ఈ క్రమంలో ఇంట్లోని ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, మంచాలు..

Viral video: నిద్రిస్తుండగా బాలుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. చివరకు..

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని పాములు ఇళ్లల్లోకి దూరిపోతుంటాయి. ఈ క్రమంలో ఇంట్లోని ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, మంచాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ షాక్ ఇస్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ పాము నిద్రిస్తున్న బాలుడి డ్రాయర్‌లోకి దూరింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని (Thailand) రేయోంగ్‌ అనే ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ బాలుడు పరుపుపై పడుకుని ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పాము బెడ్‌ పైకి రావడమే కాకుండా (snake crawled into boy underwear) చివరకు బాలుడి డ్రాయర్‌లోకి దూరిపోయింది. దీంతో అప్పటిదాకా నిద్రలో ఉన్న బాలుడు.. పామును గమనించి ఉలిక్కిపడ్డాడు. అయితే కదిలితే ఎక్కడ కాటేస్తుందో.. అనే భయంతో కదలకుండా ఉండిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోని వారు పరుగెత్తుకుంటూ వచ్చారు.

Viral video: వేటాడే ముందు సాలీడు ఏం చేస్తుందో ఎప్పుడైనా చూశారా.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..


చివరకు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించగా.. కాసేపటికి వారు అక్కడికి చేరుకున్నారు. చివరకు వారు ఎంతో చాకచక్యంగా పామును డ్రాయర్ నుంచి మెల్లగా బయటికి లాగేశాడు. ఈ ఘటనలో బాలుడికి ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబోయ్.. ఇలాంటి సీన్ ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఈ బాలుడి టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

Updated Date - Jun 27 , 2024 | 05:00 PM