Share News

Virat Kohli: టీ20 గేమ్ ప్రమోషన్‌కు నా పేరే వాడుతున్నారు.. వారికి కోహ్లీ సూపర్ అన్సర్

ABN , Publish Date - Mar 26 , 2024 | 06:00 PM

జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీకి చోటు దక్కక పోవచ్చని వార్తలు వస్తున్న వేళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని అన్నాడు.

Virat Kohli: టీ20 గేమ్ ప్రమోషన్‌కు నా పేరే వాడుతున్నారు.. వారికి కోహ్లీ సూపర్ అన్సర్

బెంగళూరు: జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో (T20 World cup) కోహ్లీకి (Virat Kohli) చోటు దక్కక పోవచ్చని వార్తలు వస్తున్న వేళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని అన్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీకి చోటు దక్కపోవచ్చని మాట్లాడుతున్న వారికి గట్టి సమాధానం ఇచ్చినట్టైంది. వెస్టిండీస్‌లో స్లో పిచ్‌లు ఉంటాయని, దీంతో అక్కడ కోహ్లీ పెదగా రాణించలేడని, అందుకే అతడిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవచ్చని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఫోర్లు, 3 సిక్సులతో 49 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 157గా ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కోహ్లీనే వరించింది. ఆరెంజ్ క్యాప్ కూడా ప్రస్తుతం కోహ్లీ వద్దనే ఉంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అత్యుత్తమ ఆట ఇవ్వడానికే ప్రయత్నిస్తానని చెప్పాడు. అయితే మ్యాచ్‌ను తానే స్వయంగా ముగించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.


‘‘టీ20ల్లో నేను ఓపెనింగ్ చేస్తున్నాను. నేను జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ వికెట్లు పడినప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలి. ఇక్కడ వికెట్ సాధారణంగా లేదు. దీంతో సరైన క్రికెట్ షాట్స్ ఆడాల్సి వచ్చింది. సరైన బంతులు దొరకలేదు. కొన్ని షాట్లు ఆడడానికి ప్రయత్నించాను. మరో ఎండ్‌లో నాకు పెద్ద హిట్‌లు కావాలి అనిపించింది. మ్యాక్సీ, అనూజ్ త్వరగా ఔట్ కావడంతో అది జరగలేదు. నేనే కవర్ డ్రైవ్ బాగా ఆడతానని బౌలర్లకు తెలుసు. కాబట్టి నన్ను గ్యాప్‌ల్లో కొట్టనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అర్ష్‌దీప్ సింగ్, కేజీ సరైన లెంగ్త్‌లో బంతులు వేశారు. అలాంటప్పుడు సరైన గేమ్ ప్లాన్‌తో ఆడాలి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్ చేయడానికి నా పేరు వాడుతున్నారని తెలుసు. వాళ్లు ఇప్పటికైన ఇది అర్థం చేసుకున్నారని నేను ఊహిస్తున్నాను.’’ అని కోహ్లీ అన్నాడు. కాగా అనేక టీ20 టోర్నీలతోపాటు ఒలింపిక్స్ గేమ్స్‌లో టీ20 క్రికెట్ ప్రమోషన్ కోసం విరాట్ కోహ్లీ పేరునే వాడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 176/6 స్కోర్ సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 45 పరుగులతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కింగ్ కోహ్లీ(77) చెలరేగాడు. ఒకానొక దశలో పంజాబ్ జట్టే గెలుస్తుందేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దినేష్ కార్తీక్(28), మహీపాల్ లోమ్రోర్(17) ఆర్సీబీని గెలిపించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా



Updated Date - Mar 26 , 2024 | 06:00 PM