Share News

Seethakka: భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌ను ఆదరించండి

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:53 PM

Telangana: భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌ను ఆదరించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో ఉంచుతామని తెలిపారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబమని చెప్పుకొచ్చారు.

Seethakka: భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌ను ఆదరించండి

ఆదిలాబాద్, ఏప్రిల్ 8: భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌ను (Congress) ఆదరించాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో ఉంచుతామని తెలిపారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబమని చెప్పుకొచ్చారు. బీజేపీ (BJP) మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని విమర్శించారు. మోదీ వచ్చి ఆదిలాబాద్‌కు ఏం ఇచ్చారని ప్రశ్నించారు.

Viral: ఉబెర్ డ్రైవర్ ఫోను సంభాషణ విన్న ప్యాసెంజర్.. ఆ తరువాత ఊహించని విధంగా..


మూతపడ్డ సీసీఐ పరిశ్రమ గురించే మాట్లాడలేదన్నారు. విద్య మీద బట్టల మీద 12 శాతం టాక్సీ వేసిందని.. పేదలను మరింత పేదలను చేసిందని విమర్శించారు. ప్రజలు తల్చుకుంటే ఎవ్వరిని ఎక్కడ కూర్చో బెట్టాలో అక్కడ కూర్చోబెడతారన్నారు. బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు. సచ్చిన శవాలకు బీజేపీ టాక్సీ వసూల్ చూశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను ఓట్లతో పక్కన పెట్టిన వారు ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టాలని కోరారు. గ్యారంటిలకే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

Lok Sabha Polls: కాంగ్రెస్‌ కోటపై కమలం కన్ను

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 04:53 PM

News Hub